Sat Mar 07 2026 22:28:43 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ ప్రకటన... టీవీల ఎదుటే నిరుద్యోగులు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగుల నోటిఫికేషన్ పై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముంది

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగుల నోటిఫికేషన్ పై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముంది. దాదాపు ముప్ఫయివేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు తెలంగాణ గత ఏడేళ్లలో ఎలా అభివృద్ధి చెందింది? ఏడేళ్లకు ముందు తెలంగాణ.. ప్రస్తుత తెలంగాణ వంటి అంశాలపై కేసీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది.
నోటిఫికేషన్.....
నిన్న వనపర్తి జిల్లాలో కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నానని, నిరుద్యోగులందరూ టీవీలు చూడాలని కోరారు. దీంతో తెలంగాణ సమాజంలో ఆసక్తి పెరిగింది. కేసీఆర్ చేసే ప్రకటన ఏమై ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. నిరుద్యోగుల నోటిఫికేషన్, ఏడేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపైనే కేసీఆర్ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి.
- Tags
- kcr
- unemployment
Next Story

