Sun Feb 01 2026 15:20:57 GMT+0000 (Coordinated Universal Time)
కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు
మధ్యాహ్నం 1 గంట సమయంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం దంపతులు.. నేరుగా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ దంపతులకు

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన సతీమణితో కలిసి మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో గల శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో సీఎం దంపతులు కొల్హాపూర్ కు బయల్దేరారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కొల్హాపూర్ చేరుకున్న సీఎం దంపతులు.. నేరుగా అమ్మవారి ఆలయానికి వెళ్లారు.
సీఎం కేసీఆర్ దంపతులకు అమ్మవారి ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన కేసీఆర్ దంపతులు కార్వీర్ నివాసిని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ దంపతులతో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్, రావుల శ్రావణ్ కుమార్ తదితరులున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అధికారికంగా ట్వీట్ చేసింది.
Next Story

