Sat Mar 21 2026 00:14:06 GMT+0530 (India Standard Time)
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై కేసీఆర్ జోస్యం
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఖచ్చితంగా స్థానాలు తగ్గుతాయని కేసీఆర్ చెప్పారు. గతంలో వచ్చిన సీట్లు రావని జోస్యం చెప్పారు

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఖచ్చితంగా స్థానాలు తగ్గుతాయని కేసీఆర్ చెప్పారు. గతంలో వచ్చిన సీట్లు రావని కేసీఆర్ జోస్యం చెప్పారు. యూపీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా బీజేపీకి మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు రావని కేసీఆర్ తేల్చి చెప్పారు. కానీ యూపీ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ పతనానికి దారి తీస్తాయని చెప్పారు.
విప్లవం రావాలి....
ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమి ఫైనల్స్ గా కేసీఆర్ చెప్పారు. బీజేపీవి మాయమాటలని అందరూ అర్థం చేసుకున్నారని అన్నారు. సరైన సమయంలో తాను నిర్ణయం తీసుకుంటానని, బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి ఇప్పుడు కొత్త విశ్వాసం అవసరమని కేసీఆర్ అన్నారు.
- Tags
- kcr
- uttar pradesh
Next Story

