Sat Dec 06 2025 00:08:47 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ సమీక్ష... భద్రాచలంపై ఆదేశాలు
భద్రాచలం వద్ద వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

భద్రాచలం వద్ద వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలానికి హెలికాప్టర్ తో పాటు అదనపు రక్షణ సామాగ్రిని తరలించాలని ఆదేశాలు జారీ ేశారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని కేసీఆర్ కోరారు. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సత్వరం వాటిని పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు.
హెలికాప్టర్ ....
భద్రాచలం వద్ద నీటి మట్టం 70 అడుగులకు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలకు సాయం అందించేలా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రెస్క్యూ టీంలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అవసరమైన లైఫ్ జాకెట్లతో పాటు రక్షణ పరికరాలను భద్రాచలనికి పంపాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
Next Story

