Sun Feb 01 2026 18:19:30 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కొల్హాపూర్ కు సీఎం కేసీఆర్ !
కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ కు బయల్దేరనున్నారు.

ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కొల్హాపూర్ కు బయల్దేరనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ కోవెల ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. నేడు మరో శక్తిపీఠాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు.
Next Story

