Sun Mar 15 2026 12:31:36 GMT+0530 (India Standard Time)
సీఎం కేసీఆర్ కు అస్వస్థత
సీఎం కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే:
"సీఎం కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్య బృందం ఇంట్లోనే చికిత్స ఇస్తోంది. వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు" అని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Next Story

