Sat Mar 07 2026 21:19:55 GMT+0530 (India Standard Time)
యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్..
కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆస్పత్రి నుంచి నేరుగా..

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఉదయం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అన్ని వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం.. కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆస్పత్రి నుంచి నేరుగా ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కాగా.. ఉదయం ఆయన ఎడమ చేయి, కాలు లాగుతున్నట్లు ఉండటంతో కుటుంబసభ్యులు యశోద ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా ? అన్న కోణంలో పలు వైద్య పరీక్షలతో పాటు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని యశోద వైద్యులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కాస్త నీరసంగా ఉన్నారని, ఆయనకు వారంరోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
Next Story

