Thu Dec 18 2025 07:30:11 GMT+0000 (Coordinated Universal Time)
మృతులకు మూడు లక్షలు ఎక్స్‌గ్రేషియో
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించివారికి 3 లక్షల ఎక్స్ గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు.

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి 3 లక్షల ఎక్స్ గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన ఐదుగురు వరంగల్ జిల్లాకు చెందిన వారు.
గాయపడిన వారికి...
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Next Story

