Thu Mar 19 2026 13:27:33 GMT+0530 (India Standard Time)
సికింద్రాబాద్ క్లబ్ మూసివేత... ఎప్పటి వరకూ అంటే?
సికింద్రాబాద్ క్లబ్ ను మూసివేస్తున్నట్లు క్లబ్ యాజమాన్యం ప్రకటించింది.

సికింద్రాబాద్ క్లబ్ ను మూసివేస్తున్నట్లు క్లబ్ యాజమాన్యం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ క్లబ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 25 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
చాలా నష్టపోయాం....
అయితే అగ్నిప్రమాదంతో చాలా వరకూ నష్టపోయినట్లు క్లబ్ యాజమాన్యం తెలిపింది. కానీ క్లబ్ సభ్యులకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. క్లబ్ లోని కొల్నాడ బార్, బిలియర్డ్స్ రూం, మెయిన్ రిసెప్షన్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకూ ఆహుతి అయిందని పేర్కంది. మెయిన్ హాలు పూర్తిగా అగ్ని ప్రమాదంలో ధ్వంసమయిందని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ క్లబ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Next Story

