Sun Dec 14 2025 19:37:29 GMT+0000 (Coordinated Universal Time)
జగ్గారెడ్డి వివాదం : హైకమాండ్ తో నేను మాట్లాడతా
జగ్గారెడ్డి వ్యవహారంపై అధిష్టానంతో మాట్లాడతానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు

జగ్గారెడ్డి వ్యవహారంపై అధిష్టానంతో మాట్లాడతానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. జగ్గారెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు. తాను సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోవద్దని జగ్గారెడ్డికి ఎప్పుడో చెప్పానని, అయితే కొందరు సున్నిత మనస్కులు హర్ట్ అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని భట్టి విక్రమార్క తెలిపారు. ఒకరిని కించపర్చే విధంగా, వ్యక్తిగత హననం చేయడం సరికాదని ఆయన అన్నారు.
మనసు మార్చుకుంటారని...
జగ్గారెడ్డి తన మనసును మార్చుకుంటారని తాను విశ్వసిస్తున్నానని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు కూడా జగ్గారెడ్డితో మాట్లాడి శాంతపర్చే ప్రయత్నం చేస్తారన్నారు. అయితే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు కొంత ఆలోచించి, ఎవరినీ నొప్పించకుండా చేయాలన్నారు. పేర్లు కూడా పెట్టకుండా ట్రోల్ చేస్తుండటంతో ఎవరూ బాధ పడవద్దని కూడా ఆయన ఇతర నేతలను కోరారు.
Next Story

