Thu Mar 19 2026 07:58:33 GMT+0530 (India Standard Time)
కల్లు తాగిన మల్లు భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గమైన మధిరలో పాదయాత్ర చేస్తున్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గమైన మధిరలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పీపుల్ప్ మార్చ్ పేరుతో మల్లు భట్టి విక్రమార్క ఈ పాదయాత్ర చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అడిగి తెలసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రస్తావిస్తున్నారు.
ఇచ్చిన హామీలను....
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఏ వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా గీత కార్మికుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు. తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానికి మోకులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కల్లు తాగారు.
Next Story

