Sun Mar 15 2026 15:21:49 GMT+0530 (India Standard Time)
Congress : నామినేషన్ దాఖలు చేసిన భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ నేడు వేశారు. నాలుగోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ నేడు వేశారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన మల్లు భట్టి విక్రమార్క అనంతరం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మల్లు భట్టి విక్రమార్క సీనియర్ కాంగ్రెస్ నేత. గత ఐదేళ్లుగా సీఎల్పీ నేతగా సమర్థవంతంగా వ్యవహరించారు. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. అందరిని కలుపుకుని వెళ్లేందుకే ఆయన ప్రయత్నిస్తారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన పాదయాత్ర కూడా నిర్వహించారు.
నాలుగోసారి గెలిచేందుకు...
మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని తన చిరునామాగా మార్చుకున్నారు. ఇప్పటి వరకూ మూడు సార్లు గెలిచిన మల్లు భట్టి విక్రమార్క నాలుగోసారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరసగా మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. నాలుగో సారి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ముఖ్యమంత్రి రేసులోనూ ఉండటంతో ఆయన గెలుపునకు ఢోకా లేదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
Next Story

