Sun Mar 15 2026 14:45:15 GMT+0530 (India Standard Time)
ఇంటర్ ప్రవేశానికి షెడ్యూల్ ఇదే
పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఇంటర్మీడియట్ లో చేరే వారికి షెడ్యూల్ ఖరారయింది

పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఇంటర్మీడియట్ లో చేరే వారికి షెడ్యూల్ ఖరారయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ లో చేరే వారికి మొదటి విడత షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మొదటి విడత ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది..
మొదటి విడత...
ఈనెల 26 నుంచి జూన్ 24 వరకు మొదటి విడత ప్రవేశం ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ ప్రవేశంలో బాలికలకు 33.33శాతం సీట్లు కేటాయించినట్టు ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Next Story

