Tue Dec 16 2025 10:36:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సంక్రాంతికి పండక్కి బ్యాడ్ న్యూస్.. వీళ్లందరికీ రేషన్ కట్
తెలంగాణలో రేషన్ కార్డులున్న వారికి అలెర్ట్ ను పౌర సరఫరాల శాఖ జారీ చేసింది

తెలంగాణలో రేషన్ కార్డులున్న వారికి అలెర్ట్. మీ కార్డు రద్దు కాకూడదనుకుంటే వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. ఇందుకు ఈ నెల 31వ తేదీ వరకూ మాత్రమే గడువు విధించింది. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కు సంబంధించి చాలా మంది ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో సీరియస్ డెసిషన్ త తీసుకుంది. రేషన్ కార్డులతో పాటు రేషన్ డీలర్లు కూడా పౌరసరఫరాల శాఖ అధికారుల ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. రేషన్ కార్డు దారులందరూ ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ కేవైసీ చేసుకోకుండా...
గత కొద్ది రోజులుగా పదే పదే చెబుతున్నా ఈకేవైసీ చేయించుకోకుండా చాలా మంది రేషన్ కార్డుదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందాలంటే రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. అదే ప్రాతిపదిక. ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, మనిషికి నెలకు ఇరవై కిలోల సన్నబియ్యంతో పాటు ఏ సంక్షేమ పథకాన్ని పొందాలంటే అందుకు రేషన్ కార్డు ను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే రేషన్ కార్డు ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యం.
ఈ నెల 31వ తేదీలోపు...
అయితే ఈ నెల 31వ తేదీ లోపు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్ కట్ చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇందుకోసం రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఖచ్చితంగా రేషన్ దుకాణాలకు వెళ్లి బయోమెట్రిక్ చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ పూర్తి చేసుకుంటేనే జనవరి నెలలో రేషన్ లభిస్తుందని తెలిపారు. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే రేషన్ అందుతుంది. లేకుంటే రేషన్ ఆపేస్తామని హెచ్చరించింది. ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ నమోదు కావడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తుండటంతో గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకూ అప్ డేట్ రాలేదు.
Next Story

