Fri Feb 20 2026 13:43:43 GMT+0530 (India Standard Time)
Delhi : నేడు ఢిల్లీలో రేవంత్, చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులు నేడు ఢిల్లీలో జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. నిన్న పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి నేడు ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొంటారు.
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి చేరుకుంటారు. ఐఏఎస్ అధికారి వికాస్ వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జైపూర్ కు నిన్న బయలుదేరి వెళ్లారు. నేడు ఢిల్లీ చేరుకుని ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొంటారు. వివిధ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story

