Sat Dec 06 2025 01:55:03 GMT+0000 (Coordinated Universal Time)
Gaddar Awards : హాలీవుడ్, బాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు చూడాలి : రేవంత్ రెడ్డి
హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డమీద ఉండాలని ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలి వచ్చిన తర్వాత నాల్గోతరం ఇక్కడ ఉందని, హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డమీద ఉండాలని ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైటెక్స్ లో జరిగిన గద్దర్ అవార్డు ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత మొదటి తరం ఎన్టీఆర్, ఏఎన్నార్, రెండో తరం కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మూడో తరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, నాల్గో తరం హీరోలతో నేడు పరిశ్రమ ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పవన్ కల్యాణ్, బన్నీ, మహేష్ బాబు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు నాల్గో తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమలో అన్ని సాంకేతిక రంగాలు అందిపుచ్చుకుని ఇక్కడే హాలీవుడ్, బాలీవుడ్ స్థాయి సినీ నిర్మాణాలు జరుగుతుండటం మంచి పరిణామమన్నారు.
మీరు చేస్తున్న శ్రమ ఫలితమే...
ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లు కూడా టాలీవుడ్ వైపు చూసే పరిస్థితి ఏర్పడిందంటే ఇక్కడ మీరు చేస్తున్న శ్రమకు తగ్గిన ఫలితమేనని రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మాతలు, డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇలా అందరూ ఇతర రాష్ట్రాల చిత్ర పరిశ్రమకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూటికి నూరుశతం సహకారం అందిస్తుందని చెప్పారు. పాలన కొనసాగించేటప్పుడు తీసుకునే నిర్ణయాలతో చిత్రపరిశ్రమను కూడా అభినందించడానికి ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 గురించి చెబుతున్నానని, చిత్ర పరిశ్రమ కూడా ఒక ముఖ్యమైన పరిశ్రమగా, దేశాభివృద్ధికి పాటుపడాలన్నది తమ కోరిక అని రేవంత్ రెడ్డి అన్నారు.
రాజమౌళిని కోరుతున్నా...
ఈరోజు వేదిక మీద నుంచి ఒక మాట స్పష్టం చేయదలచుకున్నానని, 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా నిలబడాలన్నదే ప్రణాలిక అని, తాను రాజమౌళిని అడుగుతున్నానని,బాలీవుడ్ అంటే ముంబయి, హాలీవుడ్ అంటే అమెరికా అనే రోజులు పోవాలని, వాటినే మీరు ఇక్కడకు తీసుకు రావాలని, అందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెిపారు. తాను ఏ హోదాలో ఉన్నా రాజకీయంగా అండగా ఉంటానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చిత్రపరిశ్రమకు చెందిన వారికి గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది.
Next Story

