Mon Dec 08 2025 22:27:31 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : కవిత దెయ్యం కామెంట్స్ పై రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలుసా?
యాదగిరిగుట్టని మరో తిరుమలగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కల్వకుంట్ల కవిత కామెంట్స్ పై ఆయన సెటైర్లు వేశారు

యాదగిరిగుట్టని మరో తిరుమలగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల తరహాలో యాదగిరి గుట్టలోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేస్తామని, యూనివర్సటీని యాదగిరిగుట్ట పాలక మండలి చూసకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పాలకులపై విమర్శలు చేశారు. తాటిచెట్టంత పెరిగినా రవ్వంతయినా మెదడు పెరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. గంధమల ప్రాజెక్టును గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళనకు తాను కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
మూసీప్రక్షాళన చేస్తానని...
మూసీ పక్కన వారంతా నల్లగొండ ప్రాంత రైతులేనని, వారెంత ఇబ్బందులు పడుతున్నారో తమకు తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీనది ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన తాను పుట్టిన రోజు నాడు ఈ ప్రాంతంలోనే జరుపుకున్న విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. మూసీ నది సంరక్షణలో భూములు కోల్పోయిన వారికి భూములు ఇస్తామని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లతో పాటు పరిహారం కూడా అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎర్రవెల్లి, మొయినాబాద్, జువ్వాడ ఫాంహౌస్ లను గుంజుకుంటామని తాను అనడం లేదని, మూసీని ప్రక్షాళన చేయడమే తన ముందున్న లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మాత్రమే కాదు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ కాదు.. డీఆర్ఎస్ అని...
సబర్మతి, గంగా, యుమున నదులు ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ నది ప్రక్షాళన చేస్తే ఏం పాపం వస్తుందని రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను కూడా సూటిగా ప్రశ్నించారు. సొంతింటి బిడ్డ దయ్యాలు ఉన్నాయని చెప్పిందని, అది దయ్యాల రాజ్యసమితి అని, బీఆర్ఎస్ కాదని డీఆర్ఎస్ కాదని, ఈ కొరివి దయ్యాలను పొలిమేర్ల వరకూ తరమికొట్టడానికి తనకు ప్రజలు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని, డీఏలు కూడా ఇచ్చామని తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలకు పదేళ్లు వారి సమస్యలను పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా మొదటి తేదీ జీతాలు పడ్డాయా? నేడు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు మొదటి తేదీ వస్తున్నాయా? లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వోద్యోగులకు జీతాలు చెల్లించలేనోడు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? అని రేవంత్ రెడ్డి అన్నారు. దిక్కుమాలిన ప్రతి వెధవా మనల్ని విమర్శిస్తాడా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story

