Wed Jan 28 2026 17:53:56 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఎక్స్‌లో ఈ మేరకు స్పందించారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని, ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని రేవంత్ రెడ్డి అన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
బండి సంజయ్ కూడా...
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే లాస్య నందిత మరణించడం బాధాకరమన్న ఆయన లాస్య ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. లాస్య నందిత మృతిపై హరీష్ రావు, కేటీఆర్ లు సంతాపం తెలిపారు. యువ ఎమ్మెల్యేలను కోల్పోవడం బాధకారమన్నారు. యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమని అన్నారు.
Next Story

