Tue Mar 17 2026 02:25:44 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి : రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ రెండు కిలోల రూపాయల బియ్యం, బసవతారకం ఆసుపత్రిని నిర్మించి పేదలను అండగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ మొదటి తరం అయితే, రెండో తరం చంద్రబాబు, బాలకృష్ణ అని, మూడో తరం లోకేష్, భరత్ అని రేవంత్ రెడ్డి అన్నారు.
వైద్యరంగంలో...
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి మరికొంత స్థలాన్ని కేటయిస్తే అదనపు భవనాలను నిర్మించుకుంటామని కోరారని, అందుకు ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని రేవంత్ రెడ్డి ఈ సభలో హామీ ఇచ్చారు. పేదలకు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడేయడానికి, వైద్యరంగానికి విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Next Story

