Wed Jan 21 2026 00:59:45 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ సభలో ఆయన ప్రసంగించారు.

పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. జనం మద్దతుతో వచ్చిన అధికారాన్ని ఎవరు కూలగొడతారని ఆయన ప్రశ్నించారు. తాను అయ్య, మామ పేరు చెప్పుకుని అధికారంలోకి రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. దిగిపోవడానికి నేనేమైనా అల్లాటప్పాగాడినా? అంటూ ప్రశ్నించారు. తాత, తండ్రులపేర్లు చెప్పుకుని తాను రాలేదని, బరాబర్ గా జనంలో నుంచి వచ్చామని తెలిపారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోగా చేస్తామని ఆయన చెప్పారు.
తన ప్రభుత్వాన్ని...
పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎవరూ పీకలేరన్నారు. వడ్డకు బరా బర్ బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చి రుణమాఫీ చేయలేకపోయామని అన్నారు. ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఆయన కోరారు. ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు.
Next Story

