Fri Dec 05 2025 18:03:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఎస్.ఎల్.బీ.సీ ప్రమాదంపై రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ లో ప్రమాదానికి కేసీఆర్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ లో ప్రమాదానికి కేసీఆర్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ కృష్ణా జలాలను రాయలసీమకు ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారని అన్నారు. 811 టీఎంసీలలో 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలన్న ఒప్పందంపై కేసీఆర్ సంతకం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ సంతకం కారణంగానే నేడు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులు నాడు ఆపడం వల్లనే అది నేడు కూలిందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఎస్.ఎల్.బీ.సీకి రేవంత్...
అందుకు కేసీఆర్ కారణం కాదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ను నమ్మినందుకే పాలమూరు ఇలా తయారైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనను బీఆర్ఎస్ నేతలు రోజూ పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారని, పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే వీళ్లు ఓర్చుకోలేరా? అంటూ నిలదీశారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ పై రేవంత్ అధికారులతో సమీక్ష చేస్తున్నారు.
Next Story

