Fri Dec 05 2025 22:46:20 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : పదేళ్లు నేనే సీఎం.. ఇదే నామ.. కేసీఆర్.. గుండెల మీద రాసుకో
2034 వరకూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

మరో పదేళ్లు నేనే సీఎం. ఇదేనామాట. చంద్రశేఖర్ రావు డెయిరీలో కాదు.. గుండెల మీద రాసుకో. నీ కొడుకు గుండెల మీద రాయి అని రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2034 వరకూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమయినా పదేళ్ల పాటు అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబు, 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ అదికారంలో ఉందని, అలాగే 2024 నుంచి 2023 వరకూ బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని, అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు.
పదేళ్ల కాలంలో...
కేసీఆర్ తన పదేళ్ల కాలంలో తెలంగాణకు అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలను ఏపీకి దోచి పెట్టారన్న రేవంత్ రెడ్డి ఏపీ వాళ్లు నీళ్లు తీసుకెళుతున్నా పట్టీపట్టన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ తన గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ జరిపేందుకు అసెంబ్లీకి రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ పాలమూరు బిడ్డ మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, ఫామ్ హౌస్ లో కూర్చుని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కుమిలి కుమిలి ఏడవాలన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే నీ ఇంట్లో వాళ్లకు కొలువులు ఇచ్చుకున్నావుకానీ, నిరుద్యోగ యువతను పట్టించుకోలేదని విమర్శించారు.
హామీలు అమలు చేస్తాం...
తాము అధికారంలోకి వచ్చిన యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం వరసగా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిపది నెలల కాకముందు నుంచే పదవి నుంచి దిగిపోవాలంటూ లేస్తున్న వారికి ఒకే సమాధానం చెబుతున్నానని, తనను అడ్డుకునే కొద్దీ ఇంకాపైకిలేస్తానే తప్ప కిందపడనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శాపనార్ధాలు పెడితే పదవులు ఊడవన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు పాలించమని తమకు అధికారం ఇచ్చారని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన హామీలలో చాలా వరకూ పూర్తి చేశామని, ఇంకా మిగిలిపోయిన వాటిని కూడా అమలు చేస్తామని తెలిపారు.
Next Story

