Fri Dec 05 2025 13:50:18 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తొమ్మిది రోజుల్లోనే తొమ్మిదివేల కోట్లు ఇస్తున్నాం.. రేవంత్ ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేందుకే ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేందుకే ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయయూనివర్సిటీలో రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతుకు భరోసా ఉంటుందని తెలిపారు. గతపాలకులు ఆర్థికవిధ్వంసానికి పాల్పడినా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణాన్ని మాఫీచేశామని చెప్పారు.
వ్యవసాయానికి...
దిగజారిన తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వరి వేస్తే బోనస్ ఇస్తామని ప్రకటించి ఐదు వందలు చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ తీసుకునే వారికి కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం అంటే దండగ కాదని నిరూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని కష్టాలున్నా రైతాంగాన్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు.
లక్ష కోట్ల రూపాయలను...
రైతురుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ ఉచిత విద్యుత్తు, బీమా వంటి 1,01,728 కోట్లు రైతుల కోసం ఈ పద్దెనిమిది నెలల్లో ఖర్చు పెట్టామని తెలిపారు. రైతుల కోసమే రైతు భరోసా నిధులను విడుద చేస్తున్నామని తెలిపారు. కోటి 49 ఎకరాలకు రైతు భరోసా నిధులను మంజూరు చేస్తున్నామని చెప్పారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు ఏడు లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని రేవంత్ రెడ్డి అన్నారు. తాము ఏమైనా ఎవరినీ కలవకుండా ఫామ్ హౌస్ లో ఉన్నామా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ వెళతామని తెలిపారు.
Next Story

