Fri Dec 05 2025 18:03:47 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రాజ్ నాధ్ సింగ్ తో రేవంత్ భేటీ
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు మూసీ... ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్కి ముఖ్యమంత్రి తెలియజేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు...
జాతీయ సమైక్యతకు గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిలుస్తుందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ శాఖకు చెందని భూములను బదలాయించాలని కోరారు. దీనిపై రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి.
Next Story

