Thu Mar 20 2025 01:35:05 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పిన రేవంత్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనసులో మాట చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలపై దేశంలోనే వ్యతిరేకత ఉందన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు పర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొని ఉందన్నారు.
అధికార పార్టీలకు...
అందువల్లనే అధికారపార్టీలకు ప్రతికూల వాతావరణం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకురావాలనేదే తమ ప్రణాళిక అని అన్నారు. పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై తమ దృష్టి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story