Wed Jul 09 2025 19:48:28 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికలు ముందుగా వచ్చినా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికలు నెలరోజులు ముందే రావచ్చని అన్నారు. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ఎంపిక చేయాలని ఆయన నిర్ణయించారు. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ సీట్లలో అభ్యర్థుల ఎంపికను హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
కాంగ్రెస్ నేతలే...
నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఫారం ఇచ్చిన అభ్యర్థి చేతుల మీదుగానే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి పథకాలకు లబ్దిదారులు ఎవరన్నది నిర్ణయించాలని రేవంత్ అన్నారు. సంక్షేమ పథకాల అమలు బాధ్యత జిల్లా ఇన్ఛార్జులు తీసుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు సంతృప్తి పడేలా పనిచేయాలని ఆయన సూచించారు.
Next Story