Mon Mar 16 2026 19:58:44 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రుణమాఫీ షెడ్యూల్ ను ప్రకటించిన రేవంత్ రెడ్డి
రైతు రుణాల మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు

రైతు రుణాల మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. రేపు లక్ష రూపాయల రైతు రుణాలన్నీ మాఫీ అవుతాయని తెలిపారు. నెలాఖరులోగా లక్షన్నర వరకూ ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ ఆయన తెలిపారు. అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు మొదటి వారంలోపు పూర్తవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
గతంలో ఏ ప్రభుత్వమూ...
కాంగ్రెస్ నేతలతో ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం ఇదే ప్రధమమని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో విడతల వారీగా రుణాలు మాఫీ చేసే వారని, తమ ప్రభుత్వం చెప్పిన విధంగా చేసిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ విధంగా చేయలేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేస్తున్నామని, దీనిన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రచారం చేయాలని తెలిపారు.
Next Story

