Tue Mar 24 2026 20:04:28 GMT+0530 (India Standard Time)
నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో మిగిలిన నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఈరోజు ప్రకటించే అవకాశముంది. ఇప్పటి వరకూ తెలంగాణలోని పదిహేడు స్థానాలకు గాను పదమూడు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
నాలుగు స్థానాలకు...
నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. అధినాయకత్వం ఆమోదముద్ర కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ విషయంపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు. రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Next Story

