Mon Dec 15 2025 20:40:39 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఢిల్లీ బయలుదేరిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణపై ఆయన పార్టీ హైకమాండ్ తో చర్చించడానికే వెళ్లారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణపై ఆయన పార్టీ హైకమాండ్ తో చర్చించడానికే ఢిల్లీ వెళ్లారు. రేపు మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముంది. అందువల్లనే ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
మంత్రివర్గం...
ఈ ఆరు ఖాళీలను ఆరు నెలల నుంచి భర్తీ చేయకుండా ఉంచారు. అయితే కీలక శాఖలన్నింటికి మంత్రులు ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, ఆశావహులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. సామాజికవర్గాల సమీకరణల ప్రకారం కూడా మంత్రివర్గంలో స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అంతా ఒకే అయితే రేపు రాజ్‌భవన్ లో ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది
Next Story

