Tue Jan 20 2026 15:22:52 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : చంద్రబాబుకు రేవంత్ ముందరకాళ్లకు బంధం
ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభంలో ప్రజా భవన్ కు వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభంలో ప్రజా భవన్ కు వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించారు. ఈసందర్భంగా కాళోజీ రచించిన "కాళోజీ నా గొడవ" అనే పుస్తకాన్ని బహిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆయనకు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి తమ మనసులో మాటను చెప్పకనే చెప్పినట్లయిందని అంటున్నారు.
కాళోజీ పుస్తకం బహుకరణ...
తెలంగాణ సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని కోరుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పుస్తకాన్నే మరీ ఎంచుకుని బహుకరించారంటున్నారు. కాళోజీ రాసిన పుస్తకంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉదహరించడంతో సింబాలిక్ గా అదే పుస్తకాన్ని ఇచ్చి సమావేశానికి ముందే ఈ సమావేశంలో తమ ప్రాధాన్యతలు ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

