Thu Jan 29 2026 00:08:29 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : అధికారులపై రేవంత్ సీరియస్
ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు.

ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిని పట్టుకుని శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా ఉపేక్షించవద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం జారీ చేసిన రేవంత్ రెడ్డి ఇసుక రీచ్‌లను కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేయాలని తెలిపారు.
అక్రమంగా ఇసుకను...
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని గుర్తించి పోలీసుల సహకారంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాను చూసీ చూడనట్లు వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. ఆదాయానికి గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Next Story

