Fri Dec 05 2025 21:29:25 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : హోంగార్డ్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్
తెలంగాణలో హోంగార్డ్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు

తెలంగాణలో హోంగార్డ్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో పథ్నాలుగు వేల మంది హోంగార్డులు ఉన్నారన్నారు. హోంగార్డు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇ్తామన్నారు. హోంగార్డు రోజువారీ జీతాన్ని వెయ్యి రూపాయలకు పెంచుతున్నామని చెప్పారు. హోంగార్డుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హోంగార్డు కు హెల్త్ కార్డులు ఇతామని చెప్పారు. పోలీసు పిల్లలు ఉన్నతచదువులు చదువుకునేందుకు ప్రత్యేకంగా స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
స్నేహపూర్వకంగా మెలిగి...
పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందనితెలిపారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారు వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. వారు అమార్యదగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోండని రేవంత్ రెడ్డి తెలిపారు. వీక్లీ పరేడ్ అలవెన్స్ ను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో శిక్షలు తక్కువగా పడుతున్నాయని, హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దానిపై దృష్టిపెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు.
Next Story

