Sun Feb 01 2026 04:57:54 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్ర అధికారిక చిహ్నం ఫైనల్ చేయడానికి
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాలను అద్భుతంగా చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు.
చిత్రకారుడు రుద్ర రాజేశంతో...
ఇప్పటికే తెలంగాణ జాతీయ గీతాన్ని కీరవాణి చేత స్వరపర్చడానికి ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి ఫైనల్ చేశారు. తుది నమూనాపై రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
Next Story

