Sun Mar 15 2026 13:24:04 GMT+0530 (India Standard Time)
చిరంజీవి విందులో రేవంత్
మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు

మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తనకు పద్మభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా హైదరాబాద్ లో శనివారం రాత్రి చిరంజీవి ముఖ్యులకు విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపి...
చిరంజీవికి అవార్డు రావడం తెలుగువారందరికీ గర్వకారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చిరంజీవి కుటుంబ సభ్యలతో కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Next Story

