Sat Dec 13 2025 22:31:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : విద్యా రంగంలో మార్పులకు సిద్ధం : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపాదిత మార్పులు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. విద్యారంగంలో సంస్కరణలపై ఆయన అధికారులు, విద్యారంగం మేధావులతో మాట్లాడారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు
ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యా చరిత్రలో పోషించిన పాత్రను గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత విద్యా విధానం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేదనివ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజినీరింగ్ విద్యార్థులు కోర్సును పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని, కానీ వారిలో కేవలం 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story

