Fri Feb 14 2025 18:12:25 GMT+0000 (Coordinated Universal Time)
గొంగిడి త్రిషకు కోటి రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డి
అండర్ 19 క్రికెట్ లో ప్రతిభ చూపిన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించారు

అండర్ 19 క్రికెట్ లో ప్రతిభ చూపిన తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించారు. ఇటీవల మహిళల ప్రపంచ కప్ లో గొంగడి త్రిష రాణించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గొంగడి త్రిష కలిశారు. ఈ సందర్భంగా త్రిషను రేవంత్ రెడ్డి శాలువతో సత్కరించారు. ఆమకు ప్రభుత్వం తరుపున కోటి రూపాయల నగదును ప్రకటించారు.
మరింతగా రాణించాలని...
భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే ప్రపంచ కప్ లో విజయం సాధించిన అండర్ 19 మహిళల జట్టును రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. మరింతగా మహిళలు క్రికెట్ లో రాణించాలని, అలాగే తెలంగాణ నుంచి క్రీడల్లో ఇలాగే ప్రతిభను వెలికి తీసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. క్రీడల్లో రాణిస్తున్న తెలంగాణ ఆటగాళ్లు దేశానికే కాకుండా రాష్ట్రానికి మరింత పేరు తేవాలని ఆయన కోరారు,
Next Story