Sun Mar 08 2026 07:36:38 GMT+0530 (India Standard Time)
ఎంపీకి కేసీఆర్ పరామర్శ
ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు భరోసా నిచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
రేపు దుబ్బాక బంద్...
కాగా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనను నిరసిస్తూ రేపు దుబ్బాక నియోజకవర్గంలో బంద్ ను బీఆర్ఎస్ ప్రకటించింది. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాజుకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయాలపాలు కావడంతో ఆయనకు కూడా చికిత్స అందుతున్నారు.
Next Story

