Wed Mar 25 2026 23:34:27 GMT+0530 (India Standard Time)
రేపు అసెంబ్లీలో ప్రకటన చేస్తా.. టీవీలు చూడండి
తెలంగాణ ఆవిష్కరణపై రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

తెలంగాణ ఆవిష్కరణపై రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కరణ జరిగిందో చెబుతానన్నారు. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కేసీఆర్ కోరారు. వనపర్తి జిల్లాలోని నాగవరంలో కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడారు. భవిష్యత్ లో వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనాలన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని, దేశాన్ని బాగుపర్చుకోవాలని ఆయన అన్నారు.
కులమతాలకతీతంగా...
కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశానికి తెలంగాణ ఒక ఆదర్శమని చెప్పారు. తెలంగాణ కోసం ఏట్లా కొట్లాడమో, దేశం కోసం అలాగే కొట్లాడాలన్నారు. ఏడేళ్లలో తెలంగాణను ఎలా అభివృద్ధి చేశామో చెబుతానన్నారు. విమర్శలు చేేసే వారి నోళ్లు మూయిస్తామని చెప్పారు. దీంతో కేసీఆర్ రేపు ఏం ప్రకటన చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story

