Sun Feb 01 2026 17:30:23 GMT+0000 (Coordinated Universal Time)
అకాల వర్షాలపై కేసీఆర్
అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. పంట నష్టంపై వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు

అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. పంట నష్టంపై వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. అనేక పంటలు నీటిపాలై రైతులు నష్టాలపాలయ్యారు.
పంట నష్టం అంచనాలను...
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. పంట నష్టం అంచనాలను వెంటనే రూపొందించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వారికి సాయం వెంటనే అందించేందుకు వీలుగా నష్టం వివరాలను ప్రభుత్వానికి వెంటనే అందచేయాలని ఈ సమీక్షలో కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
- Tags
- kcr
- crop damage
Next Story

