Sat Oct 12 2024 06:07:57 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో మూడురోజులు కేసీఆర్
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు మునుగోడులోనే ఉంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలకు ఇంకా సమయం పెద్దగా లేదు. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. గుర్తులు కూడా కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలోకి దిగారు. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మునుగోడు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
31న బహిరంగ సభ....
టెలిఫోన్ ద్వారా ఆయన నేతలను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు మునుగోడులోనే ఉంటున్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఆయన మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నవంబరు 1వ తేదీన ప్రచారం ముగియనుండటంతో ఈ నెల 31వ తేదీన కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story