Thu Mar 19 2026 08:54:08 GMT+0530 (India Standard Time)
తొలి సంతకం దానిపైనే
తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ అనంతరం తన కార్యాలయంలోకి ప్రవేశించారు. తొలి సంతకాన్ని ఫైళ్లపై చేశారు. పోడు భూముల పంపిణీ ఫైలుపై ఆయన సంతకాలు చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. అనేక మంది వేదపండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.
నూతన కార్యాలయంలో...
బీఆర్ఎస్ నేతలతో పాటు ఐఏఎస్ అధికారులు సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. మంత్రులు కూడా ఒకే సమయంలో నిర్ణయించిన ముహూర్తానికి కొత్త సచివాలయంలో తమకు కేటాయించిన ఛాంబర్లోకి ప్రవేశించారు. తమ ఛాంబర్లలో తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను అనేక మంది ఉద్యోగులు కలసి అభినందనలు తెలిపారు. ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
Next Story

