Sat Mar 07 2026 23:02:56 GMT+0530 (India Standard Time)
సోమేష్ కుమార్కు కీలక పదవి
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు.

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. కేబినేట్ హోదాతో కూడిన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడేళ్ల పాటు...
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సోమేష్ కుమార్ మూడు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు. సోమేష్ కుమార్ ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల బీఆర్ఎస్ సభ మహారాష్ట్రలో జరిగితే దానికి కూడా హాజరయ్యారు. అప్పుడే ఆయనకు పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు సోమేష్కుమార్ కు ప్రధాన సలహాదారు పదవిని కేసీఆర్ ఇచ్చారు.
- Tags
- somesh kumar
- kcr
Next Story

