Thu Mar 19 2026 12:02:14 GMT+0530 (India Standard Time)
KCR: ఓటు హక్కును వినియోగించుకున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును సొంత గ్రామమైన చింతమడకలో వినియోగించుకున్నారు

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. అక్కడకక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. జనగామ, నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు వారిని లాఠీ ఛార్జీ పోలింగ్ కేంద్రం నుంచి తరిమికొట్టారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయని చెబుతున్నారు.
చింతమడకలో...
కాసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును సొంత గ్రామమైన చింతమడకలో వినియోగించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన కేసీఆర్ కు మంత్రి హరీశ్‌రావు స్వాగతం పలికారు. ఆయన దగ్గరుండి పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.
Next Story

