Thu Dec 18 2025 07:31:07 GMT+0000 (Coordinated Universal Time)
ఎంఐఎంకు మద్దతిచ్చిన కేసీఆర్
మిత్రపక్షమైన ఎంఐఎంకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని పార్టీనేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతివ్వాలని నిర్ణయించారు. మిత్రపక్షమైన ఎంఐఎంకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని పార్టీనేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎంఐఎం నేతలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని కలసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని అభ్యర్థించింది. వారి అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన కేసీఆర్ మద్దతివ్వాలని నిర్ణయించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు...
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానాలతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. గతంలోనూ ఈ స్థానం ఎంఐఎందే కావడంతో వారికే వదిలేయాలని కేసీఆర్ భావించారు.
Next Story

