Thu Mar 19 2026 01:11:44 GMT+0530 (India Standard Time)
భారీ పరిహారం ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ పరిహారాన్ని ప్రకటించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో ఈరోజు కేసీఆర్ పర్యటించారు

తెలంగాణలో రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ పరిహారాన్ని ప్రకటించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో ఈరోజు కేసీఆర్ పర్యటించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా రావినూతల గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు.
ఎకరానికి...
అకాల వర్షానికి దెబ్బ తిన్న పంటకు ఏకారానికి పది వేల రూపాయల నష్టం ప్రకటించారు. మొత్తం రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. గంటలో పరిహారం నిధులు విడుదల చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా రైతులను తాము ఆదుకుంటామని కేసీఆర్ చెప్పారు.
Next Story

