Tue Mar 17 2026 09:00:55 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులతో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులతో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముంది. పార్లమెంటు సమావేశాల ను బహిష్కరించి వచ్చిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రాజీనామాలేనా?
రాష్ట్రంలో పండిన వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో సమావేశాలను బహిష్కరించి టీఆర్ఎస్ ఎంపీలు వచ్చారు. రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఐదుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారా? లేదా? అన్నది నేటి సమావేశంలో తేలనుంది.
Next Story

