Thu Mar 19 2026 12:14:45 GMT+0530 (India Standard Time)
మునుగోడులో ప్రస్తుతం పోలింగ్ శాతం ఎంతంటే?
మునుగోడు నియోజకవర్గంలో ఉదయం 11 గంటల సమయానికి 25.8 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు

మునుగోడు నియోజకవర్గంలో ఉదయం 11 గంటల సమయానికి 25.8 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓబు వేయడానికి డబ్బు ఇచ్చినా, తీసుకొచ్చినా నేరమేనని ఆయన తెలిపారు. మునుగోడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వికాస్ రాజ్ చెప్పారు.
పాల్వాయి స్రవంతి ఫిర్యాదును...
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమకు ఫిర్యాదు చేశారని, తనపై సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చామన్నారు. స్రవంతి ఫిర్యాదును సోషల్ మీడయా వింగ్ కు పంపామన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మునుగోడు నుంచి స్థానికేతరులను నియోజకవర్గం నుంచి బయటకు పంపామని వికాస్ రాజ్ చెప్పారు.
Next Story

