చేపలకు చికెన్ వేస్టేజీ కుళ్లిన గుడ్లు
జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం సాగుతోంది.

జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం సాగుతోంది. వందల ఎకరాలు లీజుకు తీసుకొని క్యాట్ ఫిష్ దందాను కొనసాగిస్తున్నారు. చుట్టూ సాధారణ చేపల చెరువులు ఉండేలా చూసుకుంటున్న నిర్వాహకులు, వాటి మధ్యలో క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల చెరువులు పెట్టారు. గద్వాల జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చికెన్ వేస్టేజీ, కుళ్లిన గుడ్లు జిల్లాకు వస్తున్నాయి. ఇలా పెంచిన నిషేధిత చేపలను గుట్టుగా హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చికెన్ వేస్టేజీ, కుళ్లిన కోడిగుడ్లను చికెన్ సెంటర్ల నుంచి సేకరించి రాత్రి సమయంలో చేపల చెరువులకు తరలిస్తున్నారు. వారు వాటిని ఉడికించి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. ఒకప్పుడు వృథాగా పారేసే చికెన్ వేస్టేజీకి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. చికెన్ వ్యర్థాలు, కుళ్లిపోయిన కోడిగుడ్లు చేపలకు ఆహారంగా వేస్తుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది.

