Wed Apr 01 2026 11:08:07 GMT+0530 (India Standard Time)
Telagnana : నేటి నుంచి చికెన్ షాపులు బంద్
నేటి నుంచి చికెన్ షాపులు తెలంగాణలో మూతపడనున్నాయి

నేటి నుంచి చికెన్ షాపులు తెలంగాణలో మూతపడనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ దుకాణాల బంద్ కు రిటైల్ దుకాణాలు పిలుపు నిచ్చాయి. రైటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపుల ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్ కు పిలుపు నిచ్చింది.
మార్జిన్ పెంచాలంటూ...
హోల్ సేల్ మార్కెట్ వ్యాపారులు మార్జిన్ ధరలను తగ్గించడంతో పాటు ధరలు పెరగడంతో తమకు నష్టం వాటిల్లుతుందని చికెన్ దుకాణాల యజమానులు నేటి నుంచి బంద్ చేస్తున్నారు. నేటి నుంచి నిరవధికంగా చికెన్ దుకాణాలను మూసివేయనున్నట్లు ప్రకటించింది. తమ మార్జిన్ ను పెంచే వరకూ బంద్ కొనసాగుతుందని వారు హెచ్చరించారు. దీంతో చికెన్ ప్రియులకు నేటి నుంచి చికెన్ అందుబాటులో ఉండదు.
Next Story

