Sun May 12 2024 07:44:38 GMT+0000 (Coordinated Universal Time)
హెటిరో డ్రగ్స్ కంపెనీలో చిరుత
హెటిరో డ్రగ్స్ కంపెనీలోకి చిరుత ప్రవేశించింది. ఈ రోజు తెల్లవారు జామున చిరుత కంపెనీలోకి ప్రవేశించింది.
హెటిరో డ్రగ్స్ కంపెనీలోకి చిరుత ప్రవేశించింది. ఈ రోజు తెల్లవారు జామున చిరుత కంపెనీలోకి ప్రవేశించింది. చిరుత రావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. హెటిరో పరిశ్రమలోకి చిరుత ప్రవేశించడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో డ్రగ్స్ కంపెనీలోకి చిరుత ప్రవేశించింది.
మత్తు మందు ఇచ్చి...
దీంతో కంపెనీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. లోపల దాక్కున్న చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశ్రమలోని హెచ్ బ్లాక్ లో చిరుత దాగి ఉందని అధికారులు గమనించారు. దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Next Story